Breaking News

టిక్‌టాక్ ఫ్రెండ్‌తో పరారైన వివాహిత.. లబోదిబోమంటున్న భర్త


టిక్‌టాక్‌లో పరిచయమైన ఫ్రెండ్‌తో వివాహిత పరారైన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. పెళ్లయిన నెలన్నరకే ఉద్యోగం నిమిత్తం భర్త సింగపూర్ వెళ్లిపోవడంతో ఆ మహిళ టిక్‌టాక్‌ ఫ్రెండ్‌తో చనువు పెంచుకుంది. ఇది క్రమంగా స్వలింగ సంపర్కానికి దారితీసింది. దీంతో విడిగా బతకలేక వారిద్దరూ ఎక్కడికో పరారయ్యారు. Also Read: తమిళనాడులోని శివగంగై జిల్లా కాళయారుకోవిల్‌ సమీపం సానాఊరణికి చెందిన వ్యక్తి ఆరోగ్య లియోకు ఈ ఏడాది జనవరి నెలలో క్రితం వినీత అనే యువతితో వివాహమైంది. లియో ఉద్యోగం నిమిత్తం పెళ్లయిన 45రోజులకే సింగపూర్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న వినీత టిక్‌టాక్‌కు బానిసైంది. అందులో అభి అనే యువతితో ఆమెకు పరిచయమై స్వలింగ సంపర్కానికి దారితీసింది. వీరిద్దరు కలిసి చనువుగా వీడియోలు తీసి పోస్ట్ చేసేవారు. ఆ వీడియోలను చూసిన లియో భార్యను మందలించినా పట్టించుకోలేదు. Also Read: అభి ఫోటోను వినీత తన భుజంపై టాటూ వేసుకుంది. ఈ విషయాన్ని వీడియోలో గమనించిన ఆమె భర్త విషయం ఏంటో తేల్చుకుందామని గతవారం సింగపూర్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో అనేక గిఫ్టులు ఉండటంతో ఆరా తీయగా అభి ఇచ్చిందని వినీత భర్తకు చెప్పింది. బీరువాలో ఉండాల్సిన 20 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వినీతను నిలదీయగా తనకు తెలీదని చెప్పింది. Also Read: దీంతో లియో భార్యను పుట్టింటికి తీసుకెళ్లి ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పి వచ్చాడు. ఈ నెల 19వ తేదీన వినీత పుట్టింట్లో నుంచి హఠాత్తుగా మాయమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అభితో పరారైనట్లు వారి విచారణలో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్నారు. బీరువాలో కనిపించకుండా పోయిన బంగారు ఆభరణాలను వినీత తన ప్రియురాలికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కడంతో వినీత భర్త, ఆమె తల్లిదండ్రులు పరువు పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read:


By September 25, 2019 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-woman-eloped-with-tiktok-friend-after-argument-with-husband/articleshow/71286984.cms

No comments