ఓలా క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం.. ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుడు


శంషాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ క్యాబ్ డ్రైవర్ వ్యక్తిని 8కిలోమీటర్ల దూరం కారుతో సహా ఊడ్చుకుని వెళ్లిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో యాదయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తోటి వాహనదారులు హెచ్చరించడంతో విషయం తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. Also Read: మంగళవారం అర్ధరాత్రి ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు ఓ క్యాబ్ డ్రైవర్ నో పార్కింగ్ జోన్‌లో కారును నిలిపి ఉంచాడు. అక్కడ యాదయ్య అనే ప్రయాణికుడిని ఎక్కించుకున్న తర్వాత పోలీసు వాహనం రావడాన్ని గమనించిన డ్రైవర్ కారును వేగంగా పోనిచ్చాడు. కంగారులో యాదయ్య చొక్కా కారు డోర్‌లో ఇరుక్కుపోయింది. ఆయన ఎంతగా అరుస్తున్నా పోలీసులు వెంబడిస్తున్నారన్న కంగారులో డ్రైవర్ పట్టించుకోకుండా కారును పోనిచ్చాడు. Also Read: అలా 8 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన తర్వాత శంషాబాద్ టోల్‌గేట్ వద్ద సిబ్బంది గమనించి విషయం డ్రైవర్‌కు చెప్పారు. అప్పటికే యాదయ్య ప్రాణాలు కోల్పోవడంతో డ్రైవర్ కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు యాదయ్య డెడ్‌బాడీని ఆస్పత్రికి తరలించారు. కారు సంస్థకు చెందినది కావడంతో నంబర్ ఆధారంగా డ్రైవర్ వివరాలు ఆరా తీస్తున్నారు. Also Read:
By September 25, 2019 at 09:50AM
Post Comment
No comments