అడివి శేష్‌ను పట్టుకుని ఏడ్చేసిన అమ్మాయి
‘ఎవరు’ సినిమా సక్సె్స్‌తో మంచి ఫాంలో ఉన్నారు ప్రముఖ నటుడు . ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ సినిమా జపాన్‌లోనూ విడుదలైంది. ఈ సినిమాను చూసిన రీనా మట్సుయ్ అనే జపనీస్ యువతి.. శేష్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆమెను కలవడానికి శేష్ ఒప్పుకోవడంతో వెంటనే ఇండియాలో వాలిపోయారు. అయితే శేష్‌ను చూడగానే రీనా ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన్ను పట్టుకుని కన్నీరుపెట్టేసుకున్నారు. ఈ విషయం గురించి శేష్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ఎవరు సినిమా చూడటానికి రీనా జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ విషయం గురించి నా టీం సమాచారం అందించింది. దాంతో నేను చాలా సంతోషించాను. మీకు మరో విషయం తెలుసా.. ఆమె హైదరాబాద్‌కు వచ్చి తాజ్ హోటల్‌లో బస చేశారు. ఎందుకంటే.. సినిమాలో తాజ్ హోటల్‌ను చూపించారని. రీనా, అకీకో వంటి విదేశీ అభిమానులు నాపై కురిపిస్తున్న ప్రేమను చిరకాలం గుర్తుపెట్టుకుంటాను’ అని పేర్కొన్నారు. రీనా శేష్‌ని కలిసినప్పుడు తీసిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘బద్లా’ సినిమాకు ‘ఎవరు’ రీమేక్‌గా వచ్చింది. ‘గూఢచారి’, ‘క్షణం’ వంటి సినిమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతున్నందుకు శేష్ సంతోషం వ్యక్తం చేశారు. ‘గూఢచారి’ సినిమాలో కథానాయికగా నటించిన శోభిత ధూలిపాళ్ల ఓ సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలోని ఓ యువకుడు శోభితను గుర్తుపట్టారట. ‘గూఢచారి’ సినిమా చూడటం వల్లే శోభితను గుర్తుపట్టాడని శేష్ వెల్లడించారు. 2002లో వచ్చిన ‘సొంతం’ సినిమాతో అడివి శేష్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వచ్చిన ‘పంజా’, ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి- ది బిగినింగ్’ సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. శేష్‌లో ఓ మంచి నటుడే కాదు స్క్రీన్‌ప్లే రైటర్ కూడా ఉన్నాడు. ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలకు గానూ ఆయన స్క్రీన్ ప్లే అందించారు. ‘క్షణం’ సినిమాకుగానూ ఆయనకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్‌గా నంది అవార్డు లభించింది. ప్రస్తుతం శేష్ ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నారు. ఆయనలో ఉన్న టాలెంట్‌ను గుర్తించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాకు నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడానికి ఒప్పుకొన్నారు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఘట్టమనేని మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్ ఎస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. శశి కిరణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘గూఢచారి’కి శశి కిరణే దర్శకత్వం వహించారు.
By September 14, 2019 at 01:08PM
No comments