Breaking News

జగన్‌కు సీమ సెగ.. హైకోర్టు కోసం మూడు ప్రాంతాల్లో ఆందోళనలు


జగన్ సర్కారుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర సెగ తాకుతోంది. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రాంత న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా లాయర్లు ఆందోళనలు చేపడుతున్నారు. రిలే నిరాహార దీక్షలకు సైతం దిగుతున్నారు. అభివృద్ధిని మొత్తం ఒకే ప్రాంతంలో కేంద్రీకరించొద్దని జగన్ సర్కారు భావిస్తోన్న తరుణంలో.. సీమ ప్రాంతానికి చెందిన లాయర్లు హైకోర్టు కోసం ఆందోళనలు చేపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ ప్రస్తుతం ఉన్న చోటే హైకోర్టును తొలగించాలని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన లాయర్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందే ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశామని, అలాంటిది ఇప్పుడు ఏర్పాటైన హైకోర్టును ఎందుకు వదులుకుంటామని కోస్తాంధ్ర ప్రాంత లాయర్లు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు తరలిస్తే సహించబోమంటున్నారు. తాజాగా హైకోర్టు విషయమై ఉత్తరాంధ్ర ప్రాంత న్యాయవాదులు కూడా ఆందోళనలు ప్రారంభించారు. హైకోర్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. మూడు రోజుల పాటు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నది ఒకే హైకోర్టు.. దాని కోసం మూడు ప్రాంతాలకు చెందిన లాయర్లు డిమాండ్లు చేస్తుండటంతో ఈ విషయంలో జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సమస్య ఒక్క హైకోర్టుతోనే ఆగిపోతుందని అనుకోలేం. సంస్థల ఏర్పాటు, ఇతరత్రా అంశాల్లోనూ మూడు ప్రాంతాలకు చెందిన వారు మాకు ప్రాధాన్యం ఇవ్వాలంటే మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. జగన్ సర్కారుకు ఇబ్బందులు తప్పవేమో.


By September 26, 2019 at 12:15PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/rayalaseema-lawyers-wants-to-shift-high-court-from-amaravati-to-kurnool/articleshow/71307193.cms

No comments