Breaking News

గ్యాంగ్ లీడర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..నాని సేఫ్!


నేచురల్ స్టార్ హీరోగా నటించిన ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా టాక్ ఒకమోస్తరుగానే ఉన్నా కూడా ఈ సినిమా టీమ్ ట్రైలర్‌తో కలిగించిన పోజిటివిటీ బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసొచ్చింది. నాని కామెడీ టైమింగ్, కొత్తదనంతో ఉన్న ఈ సినిమా లైన్, అనిరుధ్ మ్యూజిక్ లాంటి అంశాలు అన్నీఫుల్‌గా వర్క్ అవుట్ అవ్వడంతో నానీస్ టికెట్ కౌంటర్ దగ్గర తన ప్రతాపం చూపించింది. దాంతో ఈ సినిమా కొన్నుకున్నవాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. Also Read: డివైడ్ టాక్‌ని తట్టుకుని నిలబడిన నానీస్ గ్యాంగ్ లీడర్ మొదటి వారాంతంలోనే మంచి కలెక్షన్స్ సాధించింది. డొమెస్టిక్ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా నాని క్రేజ్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులకే పెట్టినపెట్టుబడిలో సగం పైగా రాబట్టింది. పైగా ఆ కలెక్షన్స్ హిట్ అనిపించుకున్న నాని గత సినిమా జెర్సీని కూడా దాటాయి. ఈ శుక్రవారం వాల్మీకి వచ్చే వరకు నాని సినిమాకి అడ్డులేదు. అయినా వాల్మీకి ఫుల్ మాస్ మూవీ అని ఆ టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. కాబట్టి వాల్మీకి గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ ని ప్రభావితం చెయ్యకపోవచ్చు. Also Read: ఈ సినిమా మొదటివారానికే సేఫ్ జోన్ లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వీక్‌ఎండ్‌‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.84 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది నానీస్ గ్యాంగ్ లీడర్. జెర్సీ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌కి దీనికి పోల్చి చూస్తే ఈ సినిమా కోటిరూపాయల పైగా మార్జిన్‌తో ముందు నిలిచింది. ఇక ఓవర్సీస్‌లో కూడా నానికి కి ఉన్న ఫ్యాన్ బేస్ ఈ సినిమాకి కలిసొచ్చింది. దాంతో ఈ సినిమా అక్కడ కూడా మొదటోమూడు రోజులకుగాను 7 లక్షల 25 వేల డాలర్స్ కలెక్ట్ చేసింది నానీస్ గ్యాంగ్ లీడర్. ఈ కలెక్షన్స్ ట్రెండ్‌ని పరిశీలిస్తే ఈ సినిమాకి లాభాలు ఎలా ఉంటాయి అనే విషయం అప్పుడే చెప్పలేకపోయినా కూడా నష్టాలు అయితే మాత్రం ఉండకపోవచ్చు. అలాగే ఈ సినిమా నాని కెరీర్ లో బెస్ట్‌గ్రాసర్‌గా నిలిచే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఒక మామూలు సినిమాతో ఇటు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌కి, అటు డైరెక్టర్ విక్రమ్.కె.కుమార్‌కి కూడా హిట్ ఇచ్చాడు నాని. ఏరియాలవారీగా నానీస్ గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ ఏరియా షేర్ (కోట్లలో) నైజాం 4.67 సీడెడ్ 1.48 ఉత్తరాంధ్ర 1. 57 గుంటూరు 1.09 తూర్పు గోదావరి 1.06 కృష్ణా 0.93 నెల్లూరు 0.36 పశ్చిమ గోదావరి 0.68 A.P అండ్ తెలంగాణ మొత్తం 11.84 కోట్లు (మూడు రోజులకు) ఓవర్సీస్ 7.25 లక్షల డాలర్స్ (మూడు రోజులకు)


By September 16, 2019 at 11:51AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nanis-gang-leader-first-weekend-collections-proves-nanis-strength-in-family-audience/articleshow/71145725.cms

No comments