Breaking News

పవన్.. మీరు అధికారంలోకి రావాలని మీరే కోరుకోకపోతే ఎలా? అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు


వైఎస్ జగన్ వంద రోజుల పాలన జనరంజకంగా సాగిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తెలిపారు. తొలి మూడు నెలల్లో తమ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. జగన్‌ వంద రోజుల పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అంబటి ప్రశంసలు గుప్పించారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌ పాలన సాగుతోందన్నారు. 4 లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని అంబటి తెలిపారు. జగన్ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ ఇచ్చిన నివేదిక పట్ల అంబటి రాంబాబు స్పందించారు. జనసేన నివేదిక చూస్తుంటే పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసి కూర్చొని రాసినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు ముందు బెంచీలో కూర్చొని రాస్తుంటే.. వెనుక బెంచీలో కూర్చున్న కాపీ కొట్టారేమో? అన్నట్టుగా ఉందన్నారు. మేము 100 ఏళ్లు పరిపాలన చేసినా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ మాకు మంచి సర్టిఫికేట్‌ ఇవ్వరని అంబటి రాంబాబు తెలిపారు. తమకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ప్రజల సరిఫ్టికెట్ మాత్రమే చాలన్నారు. మీరు అధికారంలోకి రావాలని మీరే కోరుకోకపోతే ఎలా..? ఎవరి వెలుగులోనే బతికేలా రాజకీయ పార్టీని నడపటం ఎందుకని పవన్ కళ్యాణ్‌కు చురకలు అంటించారు. కాపుల ఓట్లను చీలుస్తారని చంద్రబాబు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని పాటించేలా మీరు చేసే విమర్శలను పరిగణనలోకి తీసుకుంటాం. కానీ చౌకబారు విమర్శలు చేస్తే ప్రజలు సహించరని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మద్య నిషేధం అని చెబుతున్న ప్రభుత్వం.. మద్యం ద్వారా ఆదాయం పెంచుకుంటోందన్న పవన్ కళ్యాణ్ విమర్శలపై అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. అధికారంలోకి రాగానే బెల్టు షాపులు ఎత్తేస్తామని చెప్పిన చంద్రబాబు.. ఐదేళ్లపాటు బెల్టు షాపులను నడిపిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. జగన్ సీఎం అయ్యాక మద్యం అమ్మకాలు తగ్గిన విషయం తెలుసుకొని మాట్లాడాలన్నారు.


By September 16, 2019 at 12:06PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ysrcp-mla-ambati-rambabu-satires-on-chandrababu-naidu-and-pawan-kalyan/articleshow/71146036.cms

No comments