Breaking News

కీచక అవతారమెత్తిన ఖాకీలు.. విదేశీ మహిళను బెదిరించి గ్యాంగ్‌రేప్


కర్గిస్థాన్‌కు చెందిన మహిళపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్గిస్థాన్‌కు చెందిన ఓ యవతి(22) యూపీలోని హాతరస్ జిల్లాకు చెందిన ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె భారత పౌరురాలుగా మారేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారించేందుకని ధర్మేంద్ర, ఆకాశ్ పవార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆగస్టు 31న ఆమెను ఆగ్రా తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారిద్దరు తనను మధురలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: నిందితుల్లో ఒకరైన ధర్మేంద్ర తనపై నాలుగేళ్ల క్రితం రేప్ అత్యాచారానికి పాల్పడ్డాడని, అప్పుడు తీసిన వీడియోతో తనను ఇప్పుడు బెదిరించి ఆకాశ్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నాలుగేళ్లుగా ధర్మేంద్ర ఎన్ని బెదిరింపులకు దిగినా తాను లొంగలేదని, అయితే భారత పౌరసత్వానికి తాను చేసుకున్న దరఖాస్తును విచారించేందుకు వచ్చిన ధర్మేంద్ర తనను మధుర తీసుకెళ్లి వీడియో చూపించి బెదిరించడమే కాకుండా.. మరో కానిస్టేబుల్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ యువతి డిఎస్పీ రాకేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. Also Read: బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాకేశ్ కుమార్ తెలిపారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, వైద్య నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


By September 08, 2019 at 10:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kyrgyzstan-origin-woman-raped-by-up-cops-in-madhura/articleshow/71031766.cms

No comments