జక్కన్నపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్సా సత్యనారాయణ.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్నపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నిరోజులుగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్న బొత్సా.. తాజాగా జక్కన్న గురించి ప్రస్తావన తెచ్చారు.
దాసరి తర్వాత జక్కన్నే!
‘సినిమాల్లో రాజమౌళి చాలా గొప్పవాడు కావొచ్చు.. కానీ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆయనకు ఏం తెలుసు..?. దర్శకత్వంలో దాసరి తర్వాత రాజమౌళేనని అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏ జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి? రాష్ట్ర పరిస్థితులు ఏంటి అనే విషయాలు ఆయనకు తెలియవు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో రాజమౌళి వ్యవహారం ఒకటి. కానీ.. సీఎం జగన్ అలా కాదని, రాష్ట్రానికి ఏది అవసరమో అదే చేస్తున్నారు’ అని బొత్స కామెంట్ చేశారు.
మొత్తానికి చూస్తే.. జక్కన్నను కాసింత పొగిడి.. అంతకుమించి విమర్శలతోనే తన ప్రసంగాన్ని ముగించారు బొత్సా. మంత్రిగారి వ్యాఖ్యలు రాజకీయ, సినిమా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే బొత్సా వ్యాఖ్యలపై రాజమౌళి రియాక్ట్ అవుతారా..? లైట్‌గా తీసుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.
By September 16, 2019 at 01:15AM
No comments