Breaking News

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఇసుక పాలసీకి గ్రీన్ సిగ్నల్!


ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృతంలో బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు‌ పనుల రివర్స్ టెండరింగ్‌కు కేబినెట్ అంగీకారం తెలిపింది. రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. రివర్స్ టెండరింగ్ పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. బందర్ పోర్టు భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకోగా.. సర్కారు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆశావర్కర్లకు వేతనాలను రూ. 10 వేలకు పెంచాలని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. మావోస్టులపై మరో ఏడాదిపాటు నిషేధం విధించాని కేబినెట్ నిర్ణయంచింది. నూతన ఇసుక పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం టన్ను ఇసుక రూ.370కే లభిస్తుందని సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం స్టాక్ యార్డులను గుర్తించింది. సీఎం జగన్ గురువారం స్వయంగా ఇసుక పాలసీని ప్రకటిస్తారు. అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానున్న ఎక్సైజ్ పాలసీ విధివిధానాలు, గ్రామ సెక్రటేరియట్ తదితర అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చ జరుగుతోంది. ఆర్టీసీ విలీనంపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరుగుతోంది. జగన్ జిల్లాల పర్యటన, రచ్చబండ, ప్రజాదర్బారు లాంటి కార్యక్రమాల గురించి కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీని పూర్తి స్థాయిలో విలీనం చేయకుండా.. ప్రస్తుతానికి ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవాలని జగన్ సర్కారు నిర్ణయించింది. దీనికి కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర లభించే అవకాశం ఉంది.


By September 04, 2019 at 12:33PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/andhra-pradesh-cabinet-approves-several-key-decisions/articleshow/70973173.cms

No comments