ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని అర్ధనగ్నంగా పరుగెత్తిస్తూ పైశాచిక దాడి
ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడమే ఆ యువతి చేసిన నేరమైంది. సొంత కుటుంబసభ్యులే ఆమెను అర్ధనగ్నంగా రోడ్ల వెంట పరుగెత్తిస్తూ చితకబాదారు. మధ్యప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Also Read: అలీరాజ్‌పూర్ జిల్లాకు జిల్లాలోని తమాచి గ్రామానికి చెందిన ఓ యువతి(19) వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. అయితే ఇంట్లో తమ పెళ్లికి ఒప్పుకోరన్న ఆందోళనతో వారిద్దరూ గ్రామం విడిచి పారిపోయారు. ఆ యువతి ప్రియుడితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని ఆమె కుటుంబసభ్యులు రెండ్రోజుల పాటు తీవ్రంగా గాలించి ప్రేమజంటను ఆచూకీ తెలుసుకున్నారు. ప్రియుడిని కొట్టి యువతిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. వేరే కులంవాడితో వెళ్లిపోయి కుటుంబ పరువు తీశావంటూ ఆమెపై దాడి చేశారు. అర్ధనగ్నంగా చేసి కర్రతో కొడుతూ గ్రామంలోని రోడ్ల వెంట పరుగులు తీయించారు. Also Read: ఈ దురాగతాన్ని కొందరు స్థానికులు వీడియో తీసి వాట్సాప్‌లో వైరల్ చేయడంతో విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారు గ్రామంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై బాధిత యువతి గాని, కుటుంబసభ్యులు గాని ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. యువతి వాంగ్మూలాన్ని తీసుకున్నాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. Also Read:
By September 04, 2019 at 11:11AM
No comments