జాగ్రత్తపడుతున్న జక్కన్న.. నో లీక్స్ అంతే!
ఓటమెరుగని దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఈ భారీ చిత్రం షూటింగ్ విజయవంతంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే.. సినీ ప్రియులకు శుభవార్తే. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.
అంతేకాదు.. షూటింగ్ ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా కనీసం యంగ్ టైగర్ తారక్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లుక్స్‌పై ఎక్కడా చిన్నపాటి వార్తే కాదు సింగిల్ ఫొటో కూడా బయటికి రాలేదు.. అంతేకాదు.. లుక్ ఫలానా విధంగా ఉంటుందని కూడా టాక్ రాలేదు.. అంటే ఏ రేంజ్‌లో రాజమౌళి జాగ్రత్త వహిస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇదిలా ఉంటే.. ఇటీవల షూటింగ్‌లో భాగంగా ఓ వ్యక్తి ఫొటోలు తీయగా.. అప్రమత్తమైన రాజమౌళి తనయుడు కార్తికేయ.. వెంటనే ఆ ఫోన్ లాక్కుని నేలకోసి కొట్టాడని సమాచారం. అంతేకాదు.. షూటింగ్ స్పాట్ దరిదాపుల్లో ఫోన్ కూడా వాడకూడదని దర్శకనిర్మాతలు నిబంధన కూడా పెట్టారట. వామ్మో ఇంతలా జాగ్రత్త పడుతున్నారంటే ఫస్ట్ లుక్ రిలీజ్‌కు భారీ గానే ప్లాన్ చేశారన్న మాట. మరి ఇలా ఎన్ని రోజులు జక్కన్న జాగ్రత్త పడతాడో.. ఇంకెన్నాళ్లీ సస్పెన్స్ కొనసాగిస్తారో చూడాలి మరి.
By September 13, 2019 at 03:26AM
No comments