దళిత మహిళపై గ్యాంగ్ రేప్.. సోషల్‌మీడియాలో వీడియో వైరల్
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు దాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గా మారడంతో నిందితులు జైళ్లో ఊచలు లెక్కపెడుతున్నారు. Also Read: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కి చెందిన దళిత మహిళ ఈ నెల 12వ తేదీన పశుగ్రాసం కోసం తన పొలానికి ఒంటరిగా వెళ్తోంది. దీంతో ఆమెను అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను వదిలేయాలని బాధితురాలు వేడుకున్నా కనికరించకుండా అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు సెల్‌ఫోన్లో వీడియో తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతామని నిందితులు హెచ్చరించడంతో బాధితురాలు మిన్నకుండిపోయింది. Also Read: రెండ్రోజుల క్రితం నిందితులు రేప్ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. బాధిత మహిళ బంధువులు కొందరు ఈ వీడియో చూసి భర్త, అత్తమామలకు చెప్పగా వారు ఆమెను నిలదీశారు. దీంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాధితురాలు చెప్పింది. కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ఆమె ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు నిందితులపై ఐపీసీ 376డి(గ్యాంగ్ రేప్), 504(బెదిరింపులు), 325 సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏఎస్పీ అరుణ్‌కుమార్ తెలిపారు. Also Read:
By September 25, 2019 at 12:41PM
No comments