Breaking News

మాకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు: సౌందర్య రజనీకాంత్


అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రయాణికులకు ఎంత భద్రత ఉంది? అని ప్రశ్నిస్తున్నారు రజనీకాంత్ కుమార్తె . ఆమె తన భర్త విశాకన్ వనగమూడితో కలిసి సెప్టెంబర్ 1న లండన్ వెళ్లారు. అయితే లండన్ ఎయిర్‌పోర్ట్‌లో వారు ప్రయాణిస్తున్న ఎమిరేట్స్ విమానం ల్యాండ్ అవగానే విశాకన్ పాస్‌పోర్ట్, బ్యాగులో దాచిన అమెరికన్ డాలర్లు మిస్సయ్యాయి. ఈ విషయం గురించి తాజాగా సౌందర్య సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రయాణికులకు ఎంతటి భద్రత ఉంది. లండన్‌లోని హెత్రో ఎయిర్‌పోర్ట్‌లో మా సామాన్లు, పాస్‌పోర్ట్ పోయాయి. దాంతో వెంటనే లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఏం జరిగిందో కనుక్కుని ఈమెయిల్ ద్వారా ఏ విషయం అన్నది చెప్తామని పోలీసులు తెలిపారు. కాసేపటి తర్వాత వారి నుంచి నాకు మెయిల్ వచ్చింది. దోపిడీ జరిగిన సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదని దాంతో అక్కడ జరిగినవేవీ రికార్డ్‌ అవ్వలేదని చెప్పారు. ఇది నిజంగా షాకింగ్ ఘటన. ఎయిర్‌పోర్ట్ అధికారులు కాస్తంత బాధ్యత కూడా లేకుండా వ్యవహరిస్తారని నేను అనుకోలేదు. ఎయిర్‌పోర్ట్స్‌లో సేఫ్టీ అనేది ఎక్కడ ఉంది? మాకు జరిగిన ఘటనలకు ఎయిర్‌పోర్ట్ సిబ్బందే బాధ్యులు. మాకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. మాకే కాదు మరెవ్వరికీ ఇలాంటి అనుభవాలు ఎదురుకాకూడదు’ అని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం సౌందర్య తన భర్తతో కలిసి లండన్ నుంచి చెన్నై వచ్చేసినట్లు తెలుస్తోంది. సౌందర్య రజనీకాంత్ పెట్టిన పోస్ట్‌ని బట్టి చూస్తే ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయ్యేవరకు ఎవరో వారిని ఫాలో అయినట్లు తెలుస్తోంది. అదీకాకుండా ఎయిర్‌పోర్ట్‌లో సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసి ఎవ్వరూ ఇంతటి సాహసానికి పాల్పడరు. ఎయిర్‌పోర్ట్‌లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ముందే తెలిసే ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


By September 06, 2019 at 11:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-rajinikanth-daughter-soundarya-shares-the-horrific-experience-she-and-her-husband-faced-at-london-airport/articleshow/71005529.cms

No comments