తిహార్ జైలుకు చిదంబరం.. జగన్ ఫ్యాన్స్ హ్యాపీ, అలాగైతే మరింత..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని తిహార్ జైలుకు పంపారు. సెప్టెంబర్ 19 వరకు చిదంబరాన్ని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశించింది. దీంతో 14 రోజులపాటు ఆయన జైలు జీవితం గడపనున్నారు. ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. మొత్తం 14 రోజులు ఆయన జైలులో గడుపుతారు. గతంలో కుమారుడు కార్తీ చిదంబరం కూడా ఇదే జైలుకు వెళ్లొచ్చారు. 2010లో చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా జైలుకెళ్లారు. ఇప్పుడు అమిత్ షా హోం మంత్రిగా ఉన్న సమయంలోనే చిదంబరం తిహార్ జైలుకు వెళ్లడం గమనార్హం. చిదంబరాన్ని జైలుకు పంపుతున్నారనే వార్త బయటకు రాగానే బీజేపీతోపాటు వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్‌పై అక్రమాస్తుల కేసు మోపిన సమయంలో చిదంబరం హోం మంత్రిగా ఉన్నారు. జగన్‌పై కేసులు మోపిన వ్యవహారమంతా చిదంబరం కనుసన్నుల్లోనే నడిచిందనేది వారి వాదన. జగన్‌పై కేసులకు చిదంబరం ఎందుకంత ఆసక్తి చూపారని అనుకుంటున్నారా..? ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న చిదంబరాన్ని హోం శాఖకు మార్చడానికి సీఎం వైఎస్ ఒత్తిడే కారణమట. అదీగాక చిదంబరానికి చంద్రబాబుతో స్నేహం ఉందని జగన్ అభిమానులు చెబుతున్నారు. చంద్రబాబు నన్ను ‘ప్రత్యేకంగా’ కలిశారు అని 2012లో చిదంబరం లోక్ సభ సాక్షిగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను బాబు ఖండించారు. ఆయన్ను నేను కలవలేదని చెప్పారు. కానీ జగన్ అభిమానులు మాత్రం.. చిదంబరాన్ని చంద్రబాబు రహస్య మిత్రుడిగా అభివర్ణిస్తున్నారు. చిదంబరం అరెస్ట్ అయిన నాటి నుంచి.. అమిత్ షా నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబే అని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్‌ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు చిదంబరానికి కూడా అదే శాస్తి తప్పదని వైఎస్ఆర్సీపీ అభిమానులు శాపనార్థాలు పెడుతున్నారు. ‘దేవుడి స్క్రిప్ట్’ అదిరందంటున్నారు.
By September 06, 2019 at 12:01PM
No comments