Breaking News

‘గ్యాంగ్ లీడర్’ ట్విట్టర్ రివ్యూ: డీసెంట్ మూవీ.. నాని చించేశాడు!


ప్రస్తుతం టాలీవుడ్‌లో వేగంగా సినిమాలు పూర్తిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది నేచురల్ స్టార్ నానీనే. సంవత్సరానికి కచ్చితంగా రెండు సినిమాలను నాని ప్రేక్షకులకు అందిస్తున్నారు. కిందటేడాది ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, ఈ ఏడాది ఇప్పటికే ‘జెర్సీ’తో హిట్ కొట్టారు. ఇప్పుడు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ను తీసుకొచ్చారు. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ జర్నీ స్టార్ చేసిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు. అంతేకాదు, థియేటర్‌లో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తానంటున్నారు. Also Read: నాని రివేంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారధిగా నటించిన ఈ చిత్రం ద్వారా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘RX 100’ ఫేమ్ కార్తికేయ నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి(సీవీఎం) నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Also Read: ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమైపోయాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా చాలా డీసెంట్‌గా ఉందని అంటున్నారు. ఎక్కడా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా దర్శకుడు విక్రమ్ చాలా ఫ్లాట్‌గా సినిమాను తెరకెక్కించారట. విక్రమ్ చిత్రాలన్నింటిలో ఇదే అత్యంత సులభమైన చిత్రమని అంటున్నారు. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నడిపంచారట. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా డీసెంట్‌గా నడిచిందని ట్వీట్లు చేస్తు్న్నారు. అయితే, సెకండాఫ్ అంత గొప్పగా లేదని కొంత మంది అంటున్నారు. కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. దర్శకుడు సెకండాఫ్‌పై మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది అని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమా యావరేజ్‌గా ఉందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. నాని సూపర్ యాక్టింగ్, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలాలుగా చెబుతున్నారు. కార్తికేయ ఎంట్రీ కూడా అదిరిపోయిందట. చూద్దాం తొలిరోజు పూర్తయ్యేసరికి నాని సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో..!


By September 13, 2019 at 07:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nanis-gang-leader-movie-audience-and-public-response/articleshow/71104822.cms

No comments