Breaking News

నిజామాబాద్ గ్యాంగ్ రేప్.. నిందితులంతా పాత నేరస్థులే


నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 20) మధ్యాహ్నం యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు స్పెషల్ బృందాలను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మక్కల సురేశ్‌తోపాటు నాగరాజు, శంకర్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురు నిందితుల్లో ఐదుగురు ఇప్పటికే అరెస్ట్ కాగా.. ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వీరంతా సారంగాపూర్‌కు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. Also Read: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులందరికీ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువతిని ప్రేమ ముగ్గులోకి దించి వంచించిన సురేష్‌కు పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బులను జల్సాలకు ఖర్చు చేస్తూ జులాయిగా తిరుగుతుంటాడని పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ అదే గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారానికి యత్నించినట్లు కేసు నమోదైంది. మిగిలిన ఆరుగురు నిందితులపైనా నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్‌స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి. Also Read: సారంగాపూర్‌కు చెందిన సురేశ్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి వివాహమై అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతడికి నిజామాబాద్‌ నగర శివారులోని ఓ పల్లెటూరుకు చెందిన యువతి (24)తో పరిచయం ఏర్పడింది. ఓ కంపెనీలో పనిచేసే యువతి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో తరచూ సురేశ్ ఆటోలోనే పనికి వెళ్లేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సురేశ్‌ తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి ఆమెతో ప్రేమ నటించాడు. తరచూ ఆమెను సినిమాలు, షికార్లకు తీసుకెళ్లేవాడు. సురేశ్ శుక్రవారం మధ్యాహ్నం సారంగాపూర్‌ హనుమాన్‌ ఆలయానికి వెళ్దామని తన ప్రియురాలికి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. నేరుగా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులు మరో ఆరుగురిని కూడా అక్కడికి రప్పించాడు. అనంతరం వారు కూడా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని మరో ఇద్దరు యువకులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. Also Read: కామాంధులు పట్టుబడ్డారిలా.. ఓ కేసు విచారణ నిమిత్తం అటువైపు వెళ్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌లకు ఫారెస్ట్ ఏరియాలో ఓ ఆటో కనిపించింది. అందులో ఇద్దరు యువకులు కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని ప్రశ్నించగా తడబడుతూ సమాధానం చెప్పారు. దీంతో పోలీసులు వారి సెల్‌ఫోన్ తీసుకుని చూడగా అందులో యువతిని అత్యాచారం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో వారిని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్యవ్యాప్తంగా సంచలనం కలిగించడంతో డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. నిందితులందరినీ అరెస్ట్ చేసి కేసును త్వరగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. Also Read:


By September 22, 2019 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/nizamabad-gang-rape-case-all-accused-are-old-criminals-says-police/articleshow/71240657.cms

No comments