భూమి కోసం 23ఏళ్లుగా పోరాటం.. విసిగిపోయి కలెక్టరేట్ ఎదుటే అండర్‌వేర్ ఆరేశాడు
భూవివాదంలో తనకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ టీచర్ వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఏకంగా కలెక్టరేట్ ఎదుటే లోదుస్తులు ఆరేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన విజయ్‌సింగ్‌కు అనే ఉపాధ్యాయుడికి కొంత స్థలం ఉంది. దాన్ని స్థానిక రాజకీయ నాయకుడొకరు కబ్జా చేశాడు. దీనిపై విజయ్‌సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రాజకీయంగా పలుకుబడి ఉన్న ఆ నేత విజయ్‌ని అనేక రకాలుగా బెదిరించసాగాడు. పోలీసులు, అధికారులను మేనేజ్ చేసి దానిపై ఎలాంటి విచారణ జరగకకుండా అడ్డుకున్నాడు. బాధితుడు సుమారు 23ఏళ్ల నుంచి తనకు న్యాయం కోసం చెప్పులరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా లాభం లేకపోయింది. దీంతో విసిగిపోయిన విజయ్‌సింగ్ తాజాగా కలెక్టరేట ఎదుట వినూత్న నిరసన తెలిపారుడు. ఉదయం అక్కడే స్నానం చేసి తన లోదుస్తులను అందరూ చూసేలా ఆరేశాడు. ఈ ఘటన పెద్ద దుమారం లేపడంతో కలెక్టరేట్ ఇన్‌ఛార్జి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో విజయ్ సింగ్ తన నిరసన విరమించాడు.
By September 22, 2019 at 08:09AM
No comments