యువతను తీర్చిదిద్దడంలో గురువుల కృషిని వెలకట్టలేం: జగన్
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయనకు నివాళులు అర్పించారు. సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యాబుద్ధులను నేర్పిన గురువులను పూజించే గొప్ప సంస్కృతి మనదేశంలో ఉందని సీఎం శ్లాఘించారు. జాతి నిర్మాణంలో, యువతను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషిని కొనియాడుతూ సీఎం జగన్ ట్వీట్ చేవారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సమాజానికి వెలుగులు పంచిన మహోన్నత వ్యక్తిత్వాలన్నీ గురువుల ఉపదేశంతోనే రూపుదిద్దబడ్డాయి. అంతటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి శాశ్వత కీర్తిని తెచ్చిన మహనీయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన జయంతి సందర్భంగా ఉపాధ్యాయదినోత్సవం జరుపుకుంటున్న గురువులందరికీ శుభాకాంక్షల’’ని చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘‘తన అపార మేధోసంపత్తితో ఒక సాధారణ ఉపాధ్యాయుని స్థాయినుంచి అంచెలంచెలుగా ఎదిగి, భారతదేశ అత్యున్నత పీఠాన్ని అలంకరించిన మహోన్నత వ్యక్తి, భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా, విద్యార్థులను ఉన్నతమైన గమ్యాలవైపు నడిపిస్తున్న గురువులందరికీ ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
By September 05, 2019 at 10:29AM
No comments