Breaking News

సుమకు హాట్ యాంకర్ ఛాలెంజ్ ..!!


తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించడం.. వాళ్లు మరికొందరికి సవాల్ చేయడం ఇలా గట్టిగానే చేస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ రెండు మొక్కలు నాటి.. అనంతరం ఆయన.. హాట్ యాంకర్ కమ్ నటి అనసూయకు ఛాలెంజ్ విసిరారు. 

ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఈ హాట్ భామ కేబీఆర్ పార్కులో రెండు మొక్కలు నాటి.. తనలాగే యాంకర్ సుమ, అడవి శేష్, డైరక్టర్ వంశీ, నటుడు ప్రియదర్శిలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరింది. అంతేకాదు.. తన పెద్ద కుమారుడు శౌర్య భరద్వాజ్‌కు ఈ ఛాలెంజ్ విసిరింది. అయితే ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు ఎవరూ ట్వీట్ చేయడం కానీ.. కనీసం రియాక్ట్ కూడా కాలేదు. అయితే ఈ ఛాలెంజ్‌ ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాలి మరి.

కాగా.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే ఈ భామ అమెజాన్‌ అడవుల్లో కార్చిచ్చు, నల్లమల్లపై అడవుల్లో యురేనియం తవ్వకాలపై వరుస ట్వీట్స్ చేస్తూ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ టాలీవుడ్‌లో అందరికీ సవాల్ విసురుతోంది ఈ హాట్ భామ.



By September 16, 2019 at 02:13AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47458/hot-anchor-anasuya.html

No comments