Breaking News

పోర్న్ వీడియోలు చూపిస్తూ లైంగిక వేధింపులు.. యువకుడి అరెస్ట్


ఆఫీసులో తనతో పాటు పనిచేసే యువతులకు పోర్న్ వీడియోలు చూపిస్తూ కోరిక తీర్చాలని వేధిస్తున్న యువకుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నవీ ముంబయికి చెందిన వికాస్ చౌహాన్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అయితే ఆఫీసులో నిత్యం ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించడం వికాస్‌కు అలవాటు. తన పక్కనే కూర్చునే వారితో డబుల్ మీనింగ్స్‌తో మాట్లాడటం, చేతులు వేస్తూ ఎక్కడెక్కడో తాకేవాడే. Also Read: ఇటీవల తన ఆఫీసులో కొత్తగా చేరిన ఇద్దరు యువతులను వికాస్ తరుచూ వేధిస్తున్నాడు. వారి ఫోన్లకు అసభ్యకర ఫోటోలు, పోర్న్ వీడియోలు పంపిస్తూ కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. పని వంకతో వారిని తన ఛాంబర్‌కు రప్పించుకుని వారు చూసేలా తన ఫోన్‌లో పోర్న్ వీడియోలు ప్లే చేసేవాడు. తనతో సెక్స్ చేయకపోతే ఉద్యోగం పోతుందని బెదిరించేవాడు. Also Read: సంస్థలో అతడు ఉన్నత స్థాయిలో ఉండటంతో యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని భావించిన బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అతడిపై లిఖితపూర్వక ఫిర్యాదు అందుకున్న పోలీసులు సోమవారం వికాస్ చౌహాన్‌ను అరెస్ట్ చేశారు. ఆఫీసులోని సీసీ కెమెరాల పుటేజీతో పాటు, అతడు యువతులకు పంపిన అసభ్య వీడియోలకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. Also Read:


By September 17, 2019 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mumbai-man-arrested-for-sexual-harassment-on-collegues/articleshow/71160229.cms

No comments