ఇద్దరు చిలకలతో మాస్ స్టెప్పులు.. చితక్కొట్టేస్తున్న 'ఇస్మార్ట్ శంకర్'
వరుసగా ఫ్లాప్స్ తీస్తున్న పూరికి, ఒక్క హిట్ వస్తే బావుండును అనుకుంటున్న రామ్‌కి కూడా ఊహించినదానికంటే పెద్ద హిట్‌గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమా థియేటర్స్‌లో కలెక్షన్స్ కుమ్మేసింది. సరయిన కంటెంట్‌తో వస్తే మాస్‌బొమ్మకి ఉండే పవర్ ఏంటి అనేది ఇస్మార్ట్ శంకర్ మరొకసారి ప్రూవ్ చేసి చూపించాడు. ముందు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం కొనుకున్నవాళ్లందరికి కూడా రూపాయికి రూపాయి మిగిలేలా చేసింది. ఆ సినిమా థియేటర్స్‌లో నుండి వెళ్ళిపోయినా చాలా మందికి మైండ్స్‌లో నుండి మాత్రం పోలేదు. అందుకే ఆ సినిమా ఆన్‌లైన్‌లో ఎప్పుడు ప్రత్యక్షమవుతుందా అని వెయిట్ చేస్తున్నారు చాలామంది. Also Read: అయితే ఆ సినిమా రిలీజ్ కంటే ముందే ఆ సినిమా నుండి 'దిమాక్ ఖరాబ్' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. థియేటర్స్‌లో ఆ సాంగ్‌కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది అందరికి తెలిసిందే. మణిశర్మ ఇచ్చిన మాసీ ట్యూన్‌కి రామ్ వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకుల్ని అసలు సీట్స్‌లో కూర్చోనివ్వకుండా చేసాయి. ఇక ఆ పాటలో ఒకపక్క నభా నటేష్, మరోపక్క నిధి అగర్వాల్ కూడా తమ అందాలతో ఇస్మార్ట్ శంకర్‌కి ఫుల్లుగా సపోర్ట్ ఇచ్చారు. దాంతో ఆ పాట కోసమే సినిమాకి వెళ్లిన రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ఆ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. దాంతో ఆ పాట మార్చకుండా చూసి ఆ పాటకి కొత్త రికార్డ్స్ కట్టబెడుతున్నారు ఇస్మార్ట్ శంకర్ ఫ్యాన్స్. Also Read: మణిశర్మ ఇచ్చిన సూపర్ మాస్ ట్యూన్‌కి కాసర్ల శ్యామ్ కూడా అదే రేంజ్‌లో ఈజీగా కనెక్ట్ అయిపోయే లిరిక్స్ ఇచ్చాడు. కీర్తనశర్మ, సాకేత్ కూడా ఆ లిరిక్స్‌లోని ఇంటెన్సిటీ కరెక్ట్ గా రీచ్ అయ్యేలా పాడారు. ఇక శేఖర్ మాస్టర్ కూడా ఇంతటి ఊర మాస్ సాంగ్‌కి ఎలాంటి స్టెప్పులు అయితే సూట్ అవుతాయో అలాంటి స్టెప్పులతో దుమ్మురేపాడు. వాటిని రెడ్‌బుల్ తాగినట్టు ఎనర్జీగా ఉండే రామ్ కూడా దిమాక్ ఖరాబ్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఆ పాట సిట్యుయేషన్ కూడా సినిమాలోని కీలకమైన పాయింట్‌కి లింక్‌అప్ అయ్యి ఉండడంతో అందరికి ఇట్టే కనెక్ట్ అయిపోయింది. అందుకే అప్పుడే 10 మిలియన్స్ వ్యూస్‌కి చేరువయింది. ఒక మీడియం బడ్జెట్ సినిమాలోని పాట ఇంత త్వరగా ఈ రేంజ్ వ్యూస్ దక్కించుకోవడం అరుదు. ధాబా బ్యాక్‌డ్రాప్‌కి పక్కా మాస్ సాంగ్‌గా వచ్చిన 'దిమాక్ ఖరాబ్' ముందు ముందు మరిన్ని సంచలనాలు క్రియేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. Also Read:
By September 23, 2019 at 12:28PM
No comments