Breaking News

బాలికపై తండ్రి సహా 30 మంది అఘాయిత్యం.. రెండేళ్లుగా నరకం


కేరళలోని మలప్పురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెలారి ప్రాంతంలో ఏడో తరగతి చదువుతున్న బాలిక(12)పై తండ్రి సహా 30 మంది కామాంధులు రెండేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తనపై జరుగుతున్న దారుణాన్ని బాలిక ఉపాధ్యాయులకు చెప్పడంతో పోలీసులు ఆమె తండ్రితో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. Also Read: చదువులో చురుగ్గా ఉండే బాలిక ఇటీవల స్కూల్‌కి కూడా సరిగా రాకపోవడాన్ని టీచర్లు గుర్తించారు. ఏం జరిగిందని బాలికను ప్రశ్నించగా తనపై జరుగుతున్న దారుణాన్ని చెప్పి బోరుమంది. దీంతో వారు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారమిచ్చి ఆమెను శనివారం కమిటీ ఎదుట హాజరుపరిచారు. వారి ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు. బాలిక తండ్రితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. Also Read: తనకు పదేళ్ల వయస్సు నుంచి తండ్రి తనపై తరుచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాలిక చైల్డ్ వెల్ఫేర్ అధికారుల చెప్పింది. దీన్ని అలుసుగా తీసుకుని అతడి స్నేహితులు కూడా తరుచూ ఇంటికొచ్చి అఘాయిత్యానికి పాల్పడేవారని తెలిపింది. తండ్రి ఒత్తిడి కారణంగానే తాను చాలా రోజులు బడి మానేసి ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని వెల్లడించినట్లు చైల్డ్ లైన్ అధికారి అన్వర్ తెలిపారు. Also Read:


By September 23, 2019 at 12:09PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kerala-minor-girl-raped-by-30-persons-for-over-two-years-her-father-and-other-two-accused-held/articleshow/71254985.cms

No comments