రవిబాబు ‘ఆవిరి’.. ప్రెజర్ కుక్కర్‌లో మనిషి తల!
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తరవాత విలక్షణ దర్శకుడిగా మారారు . ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలిపి చిన్న చిన్న సినిమాలు చేస్తూ విజయాలను అందుకున్నారు. ‘అల్లరి’ సినిమాతో మొదలైన ఆయన దర్శకత్వ ప్రయాణం ‘అవును’ సినిమా వరకు సాఫీగా సాగింది. కానీ, ఆ తరవాత కుదుపులు వచ్చాయి. ‘అమ్మాయిలు అబ్బాయిలు’, ‘అనసూయ’, ‘నచ్చావులే’, ‘అమరావతి’, ‘మనసారా’ వంటి చిన్న సినిమాతో పెద్ద విజయాలు అందుకున్నారు రవిబాబు. అయితే, వరుసగా ‘అడ్డుబాబు’, ‘అవును 2’, ‘అదుగో’ సినిమాలు డిజాస్టర్లు కావడంతో రవిబాబు బాగా వెనకబడిపోయారు. దీంతో, ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమా పేరు ‘ఆవిరి’. Also Read: రవిబాబు సినిమాలు, ఆయన టైటిల్స్, పోస్టర్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా ప్రకటించిన సినిమా విషయంలోనూ ఇదే కనిపించింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. స్టౌ మీద కొంచెం తెరిచి ఉంచిన ప్రెజర్ కుక్కర్, దానిలో కళ్లు తెరిచి ఆశ్చర్యంగా చూస్తోన్న మనిషి తల, కుక్కర్ లోపల నుంచి బయటికి వస్తోన్న ఆవిరి ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ చూస్తుంటే రవిబాబు మళ్లీ మరో క్రైమ్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారని అర్థమవుతోంది. ‘ఆవిరి’ సినిమా కోసం రవిబాబుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు జట్టుకట్టారు. రవిబాబు సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో రవిబాబుతో పాటు నేహా చౌహాన్, శ్రీ ముక్త, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మిస్తున్నారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వైధ్య్ సంగీతం సమకూరుస్తున్నారు.
By September 11, 2019 at 10:35AM
No comments