మహారాష్ట్ర, హరియాణాలో మోగిన ఎన్నికల నగారా.. ఒకే విడతలో పోలింగ్!
మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికలకు నగరా మోగింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఒకే విడతలో అక్టోబరు 21న పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీఅయిన 64 శాసనసభ నియోజకవర్గాలకు ఉప-ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో 288, హరియాణాలో 90 స్థానాలకు అక్టోబరు 21 పోలింగ్ నిర్వహించి ఫలితాలను అదే నెల 24 వెల్లడించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా తెలిపారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ సెప్టెంబరు 27 వెలువడనుంది. అక్టోబరు 4 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబరు 5 నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు గడవు 7 తేదీగా నిర్ణయించారు. తెలంగాణలోని హుజూర్‌నగర్ ఉప-ఎన్నిక సైతం అక్టోబరు 21 నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది, హరియాణాలో 1.82 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని సీఈసీ తెలిపారు. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ వస్తువులను వినియోగించరాదని రాజకీయ పార్టీలను ఈసీ కోరింది. ఎన్నికల కోసం భద్రతా బలగాలను మోహరించనున్నారు. మహారాష్ట్రలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన గడ్చిరోలి, గొండియాలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తామని సునీల్ అరోరా పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున వీవీప్యాట్‌లను లెక్కించనున్నట్టు స్పష్టం చేశారు.
By September 21, 2019 at 12:44PM
No comments