Breaking News

‘సామజవరగమన’ అంటూ చంపేశారుగా!


త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా మీద ఎన్ని అంచనాలున్నాయి తెలియదు కానీ.. ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాలో వదిలిన పాటతో మాత్రం అంచనాలు భారీగా పెరగడం ఖాయం. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సామజవరగమన లిరిక్స్ తో సాగే పాట ఈ రోజే విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సింగర్ గా ఉన్న సిద్ది శ్రీరామ్ ఆలపించిన సామజవరగమన పాట అల వైకుంఠపురములో సినిమా ఆల్బమ్ లో బెస్ట్ గా నిలవడం ఖాయం.

థమన్ ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్ కి సిద్ అద్భుతమైన గొంతు కలిస్తే... ఆ సాంగ్ ఎలా ఉంటుందో అనేది సామజవరగమన పాట వింటుంటే అర్ధమవుతుంది. నీ కాళ్ళను పట్టుకుని వదలనన్నది చూడే నా కళ్ళు అంటూ సాగిన ఈ పాటలో అల్లు అర్జున్ - హీరోయిన్ పూజ హెగ్డే ల ఫొటోస్ ని ప్లే చేస్తూ వీడియో సాంగ్ సాగింది. ఇక థమన్ మ్యూజిక్ ని చూపిస్తూ సిద్ స్టైలిష్ గా పాడిన ఈ సామజవరగమన  సాంగ్ లిరిక్స్ మాత్రం యూత్ ని బ్రహ్మాండంగా ఆకట్టుకుంటాయనడంలో సందేహమే లేదు. మరి ఈ పాటతోనే త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమా హిట్ కన్ఫర్మ్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.



By September 30, 2019 at 04:31AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47670/good-response.html

No comments