చీర మార్చుకొస్తానని గదిలోకి వెళ్లిన పెళ్లికూతురు మిస్సింగ్
తాళికట్టే సమయానికి పెళ్లి కూతురు అందరి కళ్లుగప్పి జంప్ అయిన ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లా వాణియంబాడిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతికి తన మేనమామతో వివాహం నిశ్చయమైంది. సోమవారం గుడియాత్తంలోని ఓ ఆలయంలో పెద్దలు వీరిద్దరికి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. Also Read: సోమవారం ఉదయం పెళ్లి కార్యక్రమం మొదలైన తర్వాత చీర మార్చుకొస్తానని గదిలోకి వెళ్లిన ఎంతసేపటికి బయటకు రాలేదు. ఎంత పిలిచినా పలకపోవడంతో బంధువులు తలుపు పగులగొట్టుకుని లోనికి వెళ్లి చూడగా పెళ్లికూతురు కనిపించలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు, బంధువులు చుట్టపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదున Also Read: దీంతో ఆమె తల్లిదండ్రులు గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఆమె కోసం గాలిస్తున్నారు. యువతిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ప్రేమ వ్యవహారంతో ఆమే స్వచ్ఛందంగా వెళ్లిపోయిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఆమె స్నేహితులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు.
By September 04, 2019 at 09:11AM
No comments