వరంగల్ తరహా ఘటన.. తల్లి పక్కన నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అఘాయిత్యం
తల్లి పక్కన హాయిగా నిద్రిస్తున్న ఎనిమిదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. గురుగ్రామ్ సెక్టార్ -10లోని ఓ ప్రాంతంలో శనివారం రాత్రి బాలిక తన ఇంటి బాల్కనీలో తల్లిదండ్రులతో కలిసి పడుకుంది. బాలికపై ఎప్పటినుంచో కన్నేసిన వీరి ఇంటి పక్కనే ఉండే మెహర్‌సింగ్(54) అనే వ్యక్తి అర్ధరాత్రి సమయంలో బాలిక నోరు నొక్కి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. Also Read: బాలిక కేకలు విన్న తల్లిదండ్రులు అక్కడికి రాగా నిందితుడు వేరే మార్గం నుంచి పారిపోయాడు. దీంతో బాధితురాలి తల్లి తన కూతురిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెహర్‌సింగ్‌పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి మంగళవారం అరెస్ట్ చేశారు. Also Read: ఈ ఘటనపై గురుగ్రామ్ పోలీస్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుభాష్ బోకన్ మాట్లాడుతూ... బాలికపై మెహర్‌సింగ్ అత్యాచారానికి యత్నించినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. రెండ్రోజుల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో బాలికను ఎత్తుకెళ్లిన మెహర్‌సింగ్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు మేల్కోని అలారం మోగించడంతో స్థానికులంతా మెహర్‌సింగ్ ఇంటికి చేరుకున్నారు. వారికి చిక్కితే చంపేస్తారన్న భయంతో నిందితుడు బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడని తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సుభాష్ తెలిపారు. Also Read:
By September 18, 2019 at 09:16AM
No comments