Breaking News

పెళ్లి కోసం రెండేళ్లు ఆగలేకపోతున్నా.. లేఖ రాసి బాలిక సూసైడ్


మైనార్టీ తీరకపోవడంతో ప్రేమించినవాడితో పెళ్లి చేయడం లేదన్న కారణంగా ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బాలిక(16) స్థానిక పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతోంది. కొంత కాలంగా ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. Also Read: ఇటీవల ఆ యువకుడితో తన పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరింది. దానికి వారు నీకు మైనార్టీ తీరాలంటే ఇంకా రెండేళ్లు పడుతుంది. అప్పటివరకు ఆగు అని చెప్పారు. అయినా మనసు ఆగని బాలిక పెళ్లిళ్లకు మధ్యవర్తిగా వ్యవహరించే ఓ వ్యక్తిని సంప్రదించింది. బాలిక మైనర్ కావడంతో ఆయన కూడా పెళ్లి చేసేందుకు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. Also Read: తల్లిదండ్రుల సమాచారంతో ఫలక్‌నుమా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలిక రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ‘ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలని అడిగితే రెండేళ్లు ఆగాలంటున్నారు. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో. మనసుకు నచ్చిన వాడిని పొందలేనప్పుడు చావే శరణ్యమనుకుంటున్నా.. మమ్మీ డాడీ సారీ’ అంటూ లేఖలో రాసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులతో పాటు ఆమె ప్రియుడిని విచారిస్తున్నారు. Also Read:


By September 26, 2019 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/16-yr-old-hyderabad-girl-commits-suicide-for-parent-refuses-her-marraige/articleshow/71303725.cms

No comments