బంధువులు, బినామీలు నష్టపోతున్నారనే బాబు ఆందోళన: విజయసాయి
పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలను ఇస్తోందని.. రూ.300 కోట్ల కంటే తక్కువ ప్రాజెక్టులోనే రూ.58 కోట్లు ఆదా అయ్యాయని వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదా అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ విషయమై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. మరో చోట లబ్ధి కలిగించేలా కాంట్రాక్టర్‌తో జగన్ ఒప్పందం చేసుకున్నారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ స్పందించారు. రివర్స్ టెండర్లో రూ. 58 కోట్లు ఆదా అయితే ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు ఇంతకంటే భిన్నంగా ఎలా స్పందిస్తారని విజయసాయి వ్యంగాస్త్రాలు సంధించారు. నాడు వైఎస్సార్ ఉచిత విద్యుత్తు ఇస్తానంటే తీగలపై బట్టలారేసుకోవాల్సిందే అన్నాడు. ఆరోగ్యశ్రీని ప్రవేశ పెడితే ప్రైవేటు హాస్పిటళ్ల కోసమే అని శోకాలు పెట్టాడని విజయసాయి తెలిపారు. ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన చంద్రబాబు.. తన బంధువులు, బినామీలు నష్టపోతున్నారనే ఆందోళనతో అమరావతి, పోలవరం, కృష్ణపట్నం, బందరు పోర్టుల గురించే వాపోతున్నాడని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని డిమాండు చేస్తున్నాడు. ప్రభుత్వం ఏం చేయాలో ప్రాంప్టింగ్ అవసరం లేదు బాబు గారూ.. అంటూ విజయసాయి హితవు పలికారు.
By September 22, 2019 at 11:07AM
No comments