శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల మీది నుంచి దూకుతున్న కృష్ణమ్మ..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పొంగి ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం 6 గేట్లను 17 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆనకట్ట గేట్ల నిర్వహణలో అలసత్వం కారణంగా స్పిల్‌వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. కానీ దీనివల్ల డ్యామ్ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ చెబుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 3.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్‌ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.90 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 215.32 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 28,500 క్యూసెక్కులు, ఎడమ జలవిద్యుత్ కేంద్రానికి 42378 క్యూసెక్కులు, కుడి జలవిద్యుత్ కేంద్రానికి 39655 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
By September 10, 2019 at 11:19AM
No comments