భర్త చనిపోయిన మహిళతో అఫైర్.. అనుమానంతో నదిలోకి తోసేసి
తనతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళ వేరే వ్యక్తితోనూ అఫైర్ పెట్టుకుందన్న అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. నమ్మించి తనతో తీసుకెళ్లి నదిలోకి తోసేశాడు. ఈ ఘటన జిల్లాలో జరిగింది. తొండంగికి చెందిన అరుణ(28) అనే మహిళ భర్త కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలతో జీవిస్తూ పక్కింట్లో ఉండే పిల్లి శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. బతుకుదెరువు కోసం అన్నవరంలోని హరిణి బోటు షికారులో స్వీపర్‌గా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీ నుంచి అరుణ కనిపించకుండా పోయింది. శుక్రవారం ఉదయం పంపా రిజర్వాయర్‌లో ఓ మహిళ మృతదేహం తేలియాడటాన్ని గుర్తించిన స్థానికులు తొండంగి పోలీసులకు సమాచారం ఇచ్చార. పోలీసులు ఆ మృతదేహాన్ని పరిశీలించి అరుణగా గుర్తించారు. Also Read: దీంతో పోలీసుల అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా శ్రీనుతో ఆమెకున్న అక్రమ సంబంధం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అరుణను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. తనతో వ్యవహారం నడుపుతున్న అరుణ ఇటీవల మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే ఆమెను రిజర్వాయర్‌లోకి తోసి చంపేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసుల నిందితుడిపై హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By September 06, 2019 at 12:06PM
No comments