Breaking News

సుజీత్ ఎక్కడ.. నెక్స్ట్ సినిమా ఎవరితో..?


యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘సాహో’ సంచనాలు బాక్సాఫీస్ దగ్గర ఇంకా కొనసాకుతున్నాయి. ప్రభాస్‌ని పాన్ ఇండియా హీరో అని నార్త్ వాళ్ళు కూడా కన్సిడర్ చెయ్యడంతో ఇక్కడ ఉన్న ఊపే అక్కడా కనిపిస్తుంది. ఒక్క ఓవర్సీస్ మినహాయిస్తే మిగతా అన్ని చోట్లా ‘సాహో’ సేఫ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేసిన డైరెక్టర్ సుజీత్ ఎక్కడ అనేది ఇప్పడు హాట్‌టాపిక్‌గా మారింది. రెండో సినిమాకే తలకు మించిన భారాన్ని ఎత్తుకున్న సుజీత్ ఎట్టకేలకు దాన్ని సమర్థవంతంగా పూర్తి చేసాడు. అతను ఎంచుకున్న కథకి బడ్జెట్ రేంజ్ పెంచమంటే పెంచాడు.. తెలుగు సినిమాలో గతంలో చూడని యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేసాడు.. వాటిమధ్యలో అతను అనుకున్న కథను తెరకెక్కించడంలో తడబడిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాళ్లకు మాత్రం సుజీత్‌పై సాఫ్ట్ కార్నర్ ఉంది. Also Read: ఇదిలా ఉంటే, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన స్పీచ్‌ను మధ్యలో ముగించిన సుజీత్.. ‘సాహో’ ప్రమోషన్స్‌లో కూడా కనిపించలేదు. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ అతనిపై సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. కానీ, అతని నుండి ఎలాంటి వార్త లేదు. ‘సాహో’కి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా చెయ్యకపోవడంతో సుజీత్ జాడలేకుండా పోయింది. ఇంతకీ అసలు సుజీత్ ఎక్కడ అంటే అతను గోవా‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు అనే మాట వినిపిస్తుంది. ఇంత పెద్ద బాధ్యతను పూర్తిచేసిన సుజీత్.. సినిమా ఫైనల్ వెర్షన్ క్యూబ్‌లోకి అప్‌లోడ్ అవ్వగానే గోవా వేల్లిపోయాడట. సినిమా ఫలితం ఎవ్వరూ ముందే ఊహించలేరు కదా..! అందుకే ఇప్పటివరకు పడిన టెన్షన్స్ నుండి రిలీఫ్ కోసం అక్కడికి వెళ్లిన సుజీత్ సినిమా రిజల్ట్‌తో మరికొన్ని రోజులు అక్కడే ఉండబోతున్నాడు. ఎవ్వరికీ అందుబాటులో లేకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని టాక్. మరోవైపు, సుజీత్ నెక్స్ట్ సినిమా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లోనే చెయ్యాల్సి ఉంది. కానీ ఇప్పుడు అతనికి ఏ హీరో డేట్ ఇస్తాడు అనేది ఛాలెంజింగ్ విషయం. అయితే, ‘సాహో’ అలా తీసినంత మాత్రాన సుజీత్ స్టఫ్‌ని తక్కువగా అంచనా వెయ్యడం కరెక్ట్ కాదు. ‘రన్ రాజా రన్’తో శర్వానంద్ కెరీర్‌నే టర్న్ చేసిన సుజీత్.. మళ్ళీ తన కథతో అతన్నే ఒప్పించుకుని సినిమా చేసే అవకాశం లేకపోలేదు. వేరే ఏ మిడ్ రేంజ్ హీరో అయినా సుజీత్ కథకి ఓకే చెప్పడం ఖాయమే. కాకపోతే వందల కోట్ల బడ్జెట్‌ని, టాప్ రేంజ్ స్టార్ హీరో‌ని హ్యాండిల్ చేసిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మళ్ళీ కిందికి వస్తాడా అనేది చూడాలి. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.


By September 03, 2019 at 12:32PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-sujeeth-flies-to-goa-before-saaho-release/articleshow/70956960.cms

No comments