పాతబస్తీలో దారుణం.. టెన్త్ బాలుడిపై ఏడాదిగా అఘాయిత్యం
విద్యాబుద్ధులు నేర్చుకోమని తల్లిదండ్రులు హాస్టల్‌కు పంపిస్తే కామాంధులుగా మారారో ముగ్గురు బాలురు. తోటి బాలుడిని బెదిరించి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో వెలుగు చూసిన ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. Also Read: హైదరాబాద్ భవానీనగర్‌లో నివసించే బాలుడు చాంద్రాయణగుట్టలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో టెన్త్ చదువుతున్న ముగ్గురు బాలురు అతడిని బెదిరించి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో వారి పైశాచికత్వాన్ని బాలుడు మౌనంగా భరిస్తున్నాడు. Also Read: ఇటీవల బాలుడిని చూసేందుకు వచ్చిన అతడి తండ్రి హాస్టల్‌కు వచ్చాడు. కుమారుడు నీరసంగా కనిపించడంతో ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. దీంతో బాధితుడి తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 01, 2019 at 08:02AM
No comments