9ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి అత్యాచారం
జిల్లా చిన్నచింతకుంట మండలంలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. నాలుగో తరగతి చదువుతున్న బాలిక ఆదివారం రాత్రి గణేశ్ నిమజ్జనం చూసేందుకు అమ్మమ్మతో కలిసి ఊరేగింపు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లింది. అయితే ఇంటికి వెళ్దామని అమ్మమ్మని అడగగా ఆమె కొద్దిసేపు ఉందామని చెప్పింది. అయితే బాలికకు నిద్ర వస్తుండటంతో తాను ఇంటికి వెళ్లిపోతానని అమ్మమ్మతో చెప్పింది. Also Read: అదే సమయంలో వారి ఇంటి పక్కన ఉండే పోగుల రాజు అనే యువకుడు కనిపించడంతో తన మనవరాలిని ఇంటి వద్ద దించాలని మహిళ కోరింది. దీంతో రాజు బాలికను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపిక రాజు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఇంటి వద్ద దించి వెళ్లిపోయాడు. Also Read: మరుసటి రోజు బాలిక ఈ విషయాన్ని అమ్మమ్మకు చెప్పడంతో ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చిన్నచింతకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పోగుల రాజు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. Also Read:
By September 10, 2019 at 09:20AM
No comments