Breaking News

వినుకొండలో బంగారం వ్యాపారి మిస్సింగ్.. రూ.18కోట్ల అప్పుచేసి పరారీ


జిల్లా పట్టణంలో ఓ బంగారం వ్యాపారి పరారు కావడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. పట్టణ ప్రజల నుంచి సుమారు రూ.18కోట్లకు పైగా అప్పులు చేసిన ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో అప్పిచ్చిన వారు తమ డబ్బులు తిరిగొస్తాయో లేదోనని ఆందోళన పడుతున్నారు. ఈలోగా ఆదివారం సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైన ఆ వ్యాపారి తనను భాగస్వామి మోసం చేశాడంటూ ఓ లేఖ పోస్ట్ చేయడం మరింత కలకలం రేపుతోంది. వినుకొంట పట్టణంలోని మెయిన్‌ బజారుకు చెందిన తాతా గోపాలకృష్ణమూర్తి అనే వ్యక్తి 35 ఏళ్లుగా బంగారం తాకట్టు వ్యాపారం చేస్తున్నాడు. నమ్మకస్తుడిగా పేరురావడంతో స్థానికంగా ఉండే వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు ఆయనకు తక్కువ వడ్డీకే ఆయనకు డబ్బులిచ్చేవారు. ఇలా ఏళ్ల తరబడి డబ్బులు తీసుకోవడం, వడ్డీతో కలిపి చెప్పిన సమయానికి తిరిగివ్వడం చేసేవాడు. అయితే ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన ఇల్లు తాళం వేసి ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఆయనకు అప్పులు ఇచ్చిన వారంతా ఆయనింటికి వచ్చి చుట్టుపక్కల వారిని ఆరా తీస్తున్నారు. ఆదివారం పెద్దసంఖ్యలో రుణదాతలు ఆయన ఇంటికి రావడంతో ఇంతమంది దగ్గర అప్పులు చేశాడా? అని అందరూ నోరెళ్లబెట్టారు. అందరి అప్పులు కలిపితే రూ.18కోట్లకు పైగా లెక్క తేలడంతో అందరూ కలిసి వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గోపాలకృష్ణమూర్తి చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈలోగానే సీఐడీ డీజీపీ అమిత్ గార్గ్‌ పేరిట రాసిన లేఖను గోపాలకృష్ణమూర్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన భాగస్వామి అయిన పువ్వాడ ఆంజనేయులు తనను మోసం చేశాడని, వ్యాపారంలో లాభాలన్నీ తాను తీసుకుని, నష్టాలను తనమీద రుద్దాడని లేఖలో పేర్కొన్నాడు. ఆంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. గోపాలకృష్ణమూర్తి లేఖపై ఆంజనేయుడు స్పందిస్తూ.. తనకు ఆరోగ్యం సరిగా లేని కారణంగా కొన్నాళ్లుగా వ్యాపార లావాదేవీలు పట్టించుకోవడం లేదని, దాన్ని ఆసరాగా తీసుకుని గోపాలకృష్ణమూర్తే అవకతవకలకు పాల్పడి నింద తనపై నెట్టుతున్నాడని ఆరోపించారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన గోపాలకృష్ణమూర్తిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ వ్యాపార భాగస్వామలు మధ్య విభేదాలు ఎలా ఉన్నా.. గోపాలకృష్ణమూర్తిని


By September 09, 2019 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/gold-business-man-missing-in-vinukonda-case-filed/articleshow/71043588.cms

No comments