Breaking News

‘ఆర్‌ఎక్స్‌ 100’ డైరెక్టర్‌కు హీరో దొరికాడోచ్!


‘ఆర్ఎక్స్-100’ సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్‌ భూపతి.. తన తదుపరి చిత్రాన్ని ఎవరితో తెరకెక్కించాలా..? అని ఆలోచనలో పడ్డాడు. అయితే.. ఇప్పటికే మాస్‌ మహారాజ్ రవితేజతో పాటు ఒకరిద్దరికి కథ వినిపించాడు.. ఎవరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో తన కథలో తానే హీరోగా నటించాలని కూడా ఫిక్స్ అయ్యాడట. తాజాగా మనసు మార్చుకున్న ఆయన.. ‘ఇస్మార్ట్ శంకర్’తో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ అందుకున్న హీరో రామ్‌తో చేయాలని నిర్ణయించాడట.

రామ్, అజయ్ భూపతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్‌ సంస్థ అధినేత ఆనంద ప్రసాద్‌ నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. అయితే.. ప్రస్తుతం రామ్‌కు కథ వినిపించే పనిలో అజయ్ బిజీబిజీగా ఉన్నాడట. కథ ఫైనల్ అయ్యాక అధికారికంగా ప్రకటన ఉంటుందని సమాచారం. 

అయితే.. డైరెక్టర్ కిషోర్‌ తిరుమలకు రామ్‌ ఓకే చెప్పాడని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే తనకు మాస్ టచ్ ఉండే సినిమాల్లోనే మాత్రమే నటిస్తానని ఇప్పటికే ఎనర్జిక్ స్టార్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మరి అజయ్ భూపతి చెప్పిన కథలో ఏ మాత్రం మాస్ మసాలా ఉందో..? రామ్‌కు కథ ఏ మాత్రం నచ్చుతుందో..? తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే రామ్‌కు ఒకట్రెండు సినిమాలైతే రెడీగా ఉన్నాయి.. మరి దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో మరి.



By September 16, 2019 at 01:54AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47457/ajay-bhupathi.html

No comments