SIIMA 2019 List: చరణ్ ఉత్తమ నటుడు.. కీర్తి ఉత్తమ నటి.. ఇదిగో పూర్తి జాబితా

దక్షిణాది సినీ పరిశ్రమకు సంబంధించి ఏటా జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుకను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల నుంచి వచ్చిన సినిమాలకు ఏటా సైమా ద్వారా అవార్డులు అందజేస్తున్నారు. ఈ ఏడాది కూడా 8వ సైమా వేడుక ఖతార్‌లోని దోహాలో గురువారం ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకలో నాలుగు సినీ పరిశ్రమలకు చెందిన తారలు సందడి చేస్తున్నారు. గురువారం రాత్రి తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు అవార్డులు అందజేశారు. శుక్రవారం తమిళం, మలయాళం సినిమాలకు ఇస్తారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు యాంకర్ సుమ, నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. టాలీవుడ్ నుంచి ‘‘రంగస్థలం, భరత్ అనే నేను, అరవింద సమేత, మహానటి’’ వంటి సూపర్ హిట్ సినిమాలు ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్ అయ్యాయి. ‘రంగస్థలం’ సినిమా అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఆ తరవాత ‘మహానటి’ 9 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ‘గీత గోవిందం’ 8, ‘అరవింద సమేత’ 6 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. అయితే, ఉత్తమ నటుడు అవార్డు రామ్ చరణ్‌ను వరించింది. ‘రంగస్థలం’ సినిమాలో నటనకు గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ‘RRR’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ వేడుకలో పాల్గొనలేదు. కాబట్టి, చరణ్ అవార్డును ఆయన తండ్రి చిరంజీవి అందుకున్నారు. ఇక ‘మహానటి’ సినిమాలో నటనకు గాను కీర్తి సురేష్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. సీనియర్ నటి రాధిక చేతులు మీదుగా కీర్తి ఈ అవార్డును అందుకున్నారు. ‘మహానటి’ చిత్రంలో అత్యుత్తమ నటనకు గాను కీర్తి జాతీయ అవార్డును కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ అవార్డుల జాబితా ఉత్తమ నటుడు - రామ్ చరణ్ (రంగస్థలం) ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి) ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్) - విజయ్ దేవరకొండ (గీత గోవిందం) ఉత్తమ తొలిపరిచయ నటి - పాయల్ రాజ్‌పుత్ (ఆర్ఎక్స్ 100) ఉత్తమ దర్శకుడు - సుకుమార్ (రంగస్థలం) ఉత్తమ తొలిపరిచయ దర్శకుడు - అజయ్ భూపతి (ఆర్ఎక్స్ 100) ఉత్తమ సంగీత దర్శకుడు - దేవీశ్రీ ప్రసాద్ (రంగస్థలం) ఉత్తమ సహాయనటి - అనసూయ భరద్వాజ్ (రంగస్థలం) ఉత్తమ సహాయ నటుడు - రాజేంద్ర ప్రసాద్ (మహానటి) ఉత్తమ హాస్యనటుడు - సత్య (ఛలో) స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ - సుధీర్‌బాబు కన్నడ సినిమా అవార్డుల జాబితా ఉత్తమ నటుడు - యశ్ (కేజీఎఫ్ చాప్టర్ 1) ఉత్తమ దర్శకుడు - ప్రశాంత్ నీల్ (కేజీఎఫ్ చాప్టర్ 1) ఉత్తమ హాస్యనటుడు - ప్రకాశ్ తుమినార్ (సర్కార్.హి.ప్రా.షాలే.కసరగొడు, కొడుగె: రమణరాయి ) ఉత్తమ విలన్ - ధనంజయ (తగరు) ఉత్తమ సహాయనటి - అర్చన (కేజీఎఫ్ చాప్టర్ 1) ఉత్తమ తొలిపరిచయ నటి - అనుపమా గౌడ (ఆ కరాళ రాత్రి)
By August 16, 2019 at 02:12PM
No comments