విషమంగానే జైట్లీ ఆరోగ్య పరిస్థితి.. నేడు ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఈ నెల 9వ తేదీన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. గుండె సంబంధిత విభాగంలో నలుగురితో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో జైట్లీ మూత్రపిండాల సమస్యతో పాటు కేన్సర్ బారిన పడ్డారు. దీంతో ఆయన అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి స్వదేశానికి వచ్చి మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించారు. అయితే శరీరం సహకరించకపోవడంతో మోదీ కొత్త ప్రభుత్వం మంత్రి పదవి చేపట్టేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్రపతి పరామర్శ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీని రాష్ట్రపతి నేడు పరామర్శించనున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు.
By August 16, 2019 at 01:31PM
No comments