shraddha srinath: నాకు పిల్లలు వద్దు
తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడించే నటీమణుల్లో ఒకరు. ఆమె కీలక పాత్రలో నటించిన నేర్కొండ పార్వాయ్ సినిమా విజయవంతంగా దూసుకెళుతోంది. ఇది మీటూ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో లైంగిక వేధింపులపై మరోసారి ఓ ఇంటర్వ్యూలో గళం విప్పారు శ్రద్ధ. ‘మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఇప్పటికీ కొందరికి అవగాహన లేదు. రేప్ కేసులనే లైంగిక వేధింపులు అనుకుంటున్నారు. మనసులో దురాలోచన పెట్టుకుని అమ్మాయికి దగ్గరవ్వాలని చూసినా అది నేరమే అవుతుంది. ఇలాంటి సంఘటనలు ఆడపిల్లలకు ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతుంటారు. సొసైటీ ఏమనుకుంటుందో, అమ్మా ానాన్న ఎలా రియాక్ట్ అవుతారోనని భయపడుతుంటారు’ ‘ఓ అమ్మాయికి ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఎక్కడ చేతులేశారు? ఎప్పుడు జరిగింది? వంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి విషయాల్లో త్వరలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. మహిళల జీవితాల్లో మార్పులు జరుగుతున్నాయి కానీ మహిళలపై ఉండే ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదు’ ‘మా అమ్మమ్మకు 15 మంది పిల్లలు ఉన్నారు. మా అమ్మకు ఇద్దరు సంతానం. నాకు అసలు పిల్లలే వద్దు. ఇది పూర్తిగా నా నిర్ణయం. నా జీవితం నా ఇష్టం. ఈ విషయంలో నన్ను ఎవ్వరూ ప్రశ్నించకూడదు. కేవలం నాకున్న నాలెడ్జ్, ఎడ్యుకేషన్ పరంగానే నన్ను జడ్జ్ చేయాలని తప్ప నా సొంత నిర్ణయాల్లో కలగజేసుకోకూడదు’ అని చెప్పుకొచ్చారు శ్రద్ధ.
By August 29, 2019 at 11:14AM
No comments