Nani: ‘రేయ్.. నాని నీకు మామూలు చావు రాదురా.. చేతబడి చేయిస్తా’ దారుణమైన కామెంట్స్
నీచాతి నీచం.. ఘోరాతి ఘోరం.. దారుణం అనే మాటకు పరాకాష్ట.. మనుషుల్ని ఇంత ఘోరంగా తిడతారా? అమ్మ, ఆలి అనిచూడకుండా, సొసైటీలో బతుకున్నాం అనే విజ్ఞత మరిచి సోషల్ మీడియాలో బూతుపురాణం. ఈ బూతుల దాడి చేస్తుంది ఎవరో కాదు.. వివాదాస్పద నటి . ఎవరిపై అంటే నేచురల్ స్టార్ నానిపైన. ఈ ఇద్దరి మధ్య వివాదం ఇప్పటిది కాదు.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో నాని.. తనను శారీరకంగా వాడుకున్నాడని.. సిగ్గు విడిచి యాంగిల్స్‌తో సహా సోషల్ మీడియాలో పెట్టేసి అతని పరువుతీసే ప్రయత్నం చేసిన శ్రీరెడ్డి.. తనకు అన్యాయం చేశాడని వాదిస్తోంది. అయితే వీటిపై నాని స్పందిస్తూ ఆమెపై చట్టపరమైన చర్యలకు సిద్దమైన విషయం తెలిసిందే. అయితే నాని వల్ల శ్రీరెడ్డి నిజంగా నష్టపోయిందా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే.. టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉండగా.. శ్రీరెడ్డి నానినే ఎందుకు టార్గెట్ చేసిందనేది ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్. అయితే సమయం వచ్చిన ప్రతిసారి నానిపై తీవ్ర ఆరోపణలు చేసే శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయింది. రాయడానికి వీలులేని బూతులతో చెలరేగిపోయింది. పచ్చి బూతులు తిడుతూ.. చివరికి నాని భార్యను సైతం వదల్లేదు. ‘కోర్టులో పరువు నష్టం ఏంట్రా నీ బొంద? నువ్వు దె***** మళ్లీ రివర్స్‌లో నాకు కేసు ఏంట్రా..? నీ పెళ్లాన్ని ****** దానికి కూడా కేసు పెట్టు.. లం***’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. అంతటితో ఆగకుండా తనను నాని టార్చర్ చేస్తున్నాడని ఆరోపించింది శ్రీరెడ్డి. నాని నీ డబ్బు చూసుకుని టార్చర్ చేస్తున్నావ్ కదా.. ఆ లక్ష్మిని నీ ఇంట్లో నుండి బయటకు వచ్చి జ్యేష్ఠ దేవి తిష్ట వేయాలి నీ ఇంట్లో’ అంటూ శాపనార్ధాలు పెట్టింది. మరో పోస్ట్‌లో.. ‘ఈరోజుకి టార్చర్ చూపించే నీకు మామూలు చావు రాదు రా.. చేతబడి చేయించి చంపాల్రా నాని. అరేయ్.. నాని నీకు, నీ ఫ్యామిలీకి కూడా నా ఏడుపు తగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇంత టార్చర్ చూపిస్తున్న నువ్వు నాశనం.. అతి త్వరలోనే’ అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.
By August 03, 2019 at 12:58PM
No comments