Man vs Wild: బేర్ గ్రిల్స్‌కి హిందీ ఇలా అర్థమైంది.. గుట్టు విప్పిన ప్రధాని మోదీ
మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా సాహసికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సాహస యాత్ర చేశారు. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమైన ఈ షో చూసిన వారిలో చాలా మంది.. మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. బేర్ గ్రిల్స్‌కు ఎలా అర్థమైందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. బేర్ గ్రిల్స్‌కి హిందీ ఎలా అర్థమైందనే విషయం కొంత మంది తటపటాయిస్తూనే నన్ను అడిగారని ప్రధాని తెలిపారు. ఈ షోను ఎడిట్ చేశారా? ఎన్నిసార్లు షూట్ చేశారంటూ ప్రశ్నలు అడిగారని మోదీ తెలిపారు. బేర్ గ్రిల్స్‌కు హిందీ ఎలా అర్థమైందనే రహస్యాన్ని ‘మన్ కీ బాత్’లో భాగంగా మోదీ బయటపెట్టారు. టెక్నాలజీ కారణంగా హిందీని అర్థం చేసుకోగలిగారని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో నేను మాట్లాడిన ప్రతి మాట తక్షణమే ఇంగ్లిష్‌లోకి అనువాదం అయ్యేది. బేర్ గ్రిల్స్ చెవిలో చిన్న కార్డ్‌లెస్ పరికరం అమర్చారు. దాని వల్ల నేను హిందీలో మాట్లాడిన పదాలను ఆయన ఇంగ్లిష్‌లో వినగలిగారు. అలా మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా సులువైంద’’ని ప్రధాని మోదీ తెలిపారు. Read Also: ఈ షో ప్రసారమైన తర్వాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి చాలా మంది చర్చించుకుంటున్నారని మోదీ చెప్పారు. జీవితంలో ఒక్కసారైనా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలని ప్రధాని మోదీ సూచించారు.
By August 25, 2019 at 06:14PM
No comments