Kiccha Sudeep: సల్మాన్‌ను తన్నమన్నారు
దబాంగ్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడో చిత్రం దబాంగ్ 3. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమాలో సుదీప్.. సల్మాన్‌ను గుండెలపై తన్నే సన్నివేశం ఒకటుంది. ఈ సన్నివేశం చేయడానికి సుదీప్ చాలా భయపడిపోయారట. ఈ సన్నివేశంలో నటించలేనని ప్రభుదేవాకు చెప్పారట. ఈ విషయాన్ని సుదీప్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘సల్మాన్‌ను గుండెలపై తన్నమన్నారు. కానీ నా వల్ల కాలేదు. సల్మానేమో బడ్డీ కిక్ మీ అనేవారు. కానీ నేను చేయలేకపోయేవాడిని. నా సమస్య అర్థం చేసుకుని దర్శకుడు ప్రభుదేవా చిత్రీకరణ కొన్ని రోజులు వాయిదా వేశారు. ఆ తర్వాత తన్నే సన్నివేశంలో కొన్ని మార్పులు చేశారు. అప్పుడే నాకు తెలిసింది.. దక్షిణాదిలో నన్ను తన్నడానికి నటులు ఎందుకంత ఇబ్బంది పడేవారో’ ‘నా మరో సమస్య ఏంటంటే.. నాకు హిందీ రాదు. అందుకే నేను సెట్స్‌కు వెళ్లినప్పుడు నాకే ఒకేసారి అన్ని డైలాగులు ఇవ్వొద్దని ప్రభుదేవాకు చెప్పాను. దూరంగా నిలబడి సినిమాలు చూసేవాడిని. అలాంటిది ఇప్పుడు ఆయన సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాను. సల్మాన్‌ది బంగారం లాంటి మనసు. తనవారు అని ఆయన అనుకున్నారంటే ఎంతో నిజాయతీగా, ప్రేమగా చూసుకుంటారు’ అని తెలిపారు సుదీప్. ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క సుదీప్ పెహల్వాన్ చిత్రంతో బిజీగా ఉంది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 12న 2,500 స్క్రీన్లపై విడుదల కాబోతోంది.
By August 29, 2019 at 01:06PM
No comments