Breaking News

Jammu & Kashmir: కశ్మీర్‌లో ఏం జరగబోతుంది లైప్ అప్‌డేట్స్... కాసేపట్లో క్యాబినేట్ భేటీ


అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో పేలుడు పదార్థాలు, మారణాయుధాలు లభ్యమయ్యాయని, వీలైనంత త్వరగా యాత్రను ముగించుకుని యాత్రికులు వెళ్లిపోవాలని కేంద్రం నాలుగు రోజుల కిందట హెచ్చరికలు జారీచేసింది. తర్వాత తొలుత 10,000 అదనపు బలగాలను తరలించిన కేంద్రం, వీటిని ప్రస్తుతం 35,000 వేలకు పెంచింది. విద్యా సంస్థలను మూసివేసి, పర్యాటకులను వెనక్కు వెళ్లిపోవాలని సూచించడంతో వారు హడావుడిగా తిరుగు ముఖం పట్టారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొడానికి ఆసుపత్రులను పూర్తిస్థాయి సన్నద్ధం చేశారు. ఈ హడావుడి చూస్తుంటే జమ్ము కశ్మీర్‌లో ఏదో కీలక మార్పులే చోటు చేసుకోనున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరోపక్క ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని గతంలో మురళీ మనోహర్‌ జోషీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర మోదీ ఫొటో హఠాత్తుగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. దీంతో ఆర్టికల్‌ 35ఏ రద్దుకానీ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై దాడి చేయవచ్చనే ప్రచారం కానీ జరుగుతోంది. Read Also: ఇక, అమర్‌నాథ్‌ యాత్ర కుదింపు సాధారణ అంశం కాదు. గతంలో అమర్‌నాథ్‌ యాత్రీకులపై ఉగ్రదాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అయినా నాటి ప్రభుత్వాలు భద్రతా ఏర్పాట్లను మరింత పెంచి యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కొనసాగించాయి. అలాంటింది చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ సారి యాత్రనే కుదించుకోవడమో.. రద్దు చేసుకోవడమో చేయాలని ప్రభుత్వం కోరడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Read Also: ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ కీలక భేటీ సోమవారం ఉదయం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు అత్యవరసరంగా సమావేశమవుతున్నారు. కశ్మీర్‌లోని ఉగ్రవాదుల్లో 80 శాతం మంది గతంలో రాళ్లు రువ్వేవారిగా పనిచేసినట్టు భద్రతాధికారులు పేర్కొన్నారు. రాళ్లు రువ్వే ఘటనలే ఉగ్రవాదులకు రిక్రూట్‌మెంట్ల్‌గా మారుతున్నాయని, వారిని గుర్తించే ఉగ్రబృందాలు వారికి నెమ్మదిగా భావజాలాన్ని జొప్పించి ఉగ్రశిక్షణకు పంపిస్తున్నాయి.


By August 05, 2019 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jammu-kashmir-situationissue-live-updates-section-114-amarnath-yatra/articleshow/70529434.cms

No comments