Breaking News

విశాల్ - అనీశాల మధ్య ఏం జరిగింది?


కోలీవుడ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ - హీరో విశాల్ మధ్య లవ్ ఎఫైర్ నడిచిన విషయం తెలిసిందే. చాలా రోజులు ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా బ్రేకప్ చేసుకున్నారు. అయితే కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న విశాల్.. అనీశాని లవ్ చేస్తున్నాడంటూ ప్రచారం మొదలవడం.. అదే ఊపులో హైదరాబాద్‌లో విశాల్ - అనీశాల ఎంగేజ్మెంట్ జరగడం.. కొన్ని నెలల తర్వాత పెళ్లి అంటూ ప్రకటన రావడం జరిగాయి. ఇక విశాల్ సినిమాల్లో, నడిగర్ సంగం ఎన్నికల విషయంలో బాగా బిజీ అయ్యాడు. అయితే తాజాగా ఓ పదిరోజుల క్రితం వరలక్ష్మి శరత్ కుమార్ తనింక లైఫ్ లో పెళ్లి చేసుకోనని చెప్పి అందరికి షాకిచ్చింది.

ఇక తాజాగా విశాల్ - అనీశాల ప్రేమ, పెళ్లి కూడా బ్రేకప్ అయినట్లుగా మీడియా టాక్. విశాల్ తనని అనీశా చాలా ప్రేమించేదని.. దేవుడే తనకి తోడుగా అనీశాని పంపాడని చాలా సందర్భాల్లో చాలా సార్లు చెప్పాడు. ఇక మరికొద్ది రోజుల్లో వారి పెళ్లి మాట విందామనుకుంటే.... సడన్‌గా ఇలా విశాల్ - అనీషా‌ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే ఇలాంటి వార్తలు రావడానికి కారణం.. సోషల్ మీడియాలో అనిశా... విశాల్ ఫొటోస్‌ని డిలీట్ చెయ్యడమే అంటున్నారు. 

విశాల్‌కి అనిశాకి గత కొంతకాలంగా మనస్పర్థలు నడుస్తున్నాయని.. ఆ విభేదాల కారణంగానే వీరిద్దరికి బ్రేకప్ అయ్యిందనే న్యూస్ నడుస్తుంది. మరి ఇద్దరు ప్రేమికుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి వద్దంటుంటే.. విశాల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అవుతోంది.



By August 24, 2019 at 03:09AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47176/vishal.html

No comments