ఓయూ లేడీస్ హోస్టల్‌లో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్
గతవారం ఉస్మానియా యూనివర్శిటీలోని లేడీస్ హాస్టల్‌లోకి ప్రవేశించి యువతిని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పాత నేరస్థుడు సన్నీ అలియాస్ సోనీగా గుర్తించినట్లు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రమేశ్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియా ఎదుట హాజరుపరిచారు. Also Read: కమిషనర్ కథనం ప్రకారం.. రమేష్, సన్నీలు ఓయూ హాస్టల్‌లోకి ప్రవేశించి మొబైల్ ఫోన్లు దొంగిలించాలని ప్లాన్ వేసుకున్నారు. ఆరోజు అర్ధరాత్రి ఇంజినీరింగ్ స్టూడెంట్స్ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. సన్నీ బయటే ఉండగా.. రమేశ్ వాటర్ పైపులు పట్టుకుని లేడీస్ హాస్టల్ బాత్‌రూమ్‌లోకి చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువతి రమేశ్‌ను చూసి కేకలు పెట్టింది. దీంతో రమేశ్ ఆమెను కత్తితో బెదిరించి వెళ్లిపోయాడు. Also Read: ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఓయూలో విద్యార్థులకు భద్రత కరువైందంటూ విమర్శలు గుప్పించారు. దీంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి టాస్క్‌ఫోర్స్ సాయం తీసుకున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి దుండగులు పాత నేరస్థులేనని గుర్తించారు. వారి కదలికలపై నిఘా పెట్టి శుక్రవారం జామై ఉస్మానియా సమీపంలో సన్నీని అదుపులోకి తీసుకున్నారు. రమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు. సన్నీపై పీడీ చట్టం ప్రయోగిస్తామని వెల్లడించారు.
By August 24, 2019 at 12:58PM
No comments