అమీర్‌పేటలో హైటెక్ వ్యభిచారం.. నలుగురి అరెస్ట్
నగరంలోని ప్రధాన ప్రాంతమైన అమీర్‌పేటలో హైటెక్ పద్ధతిలో నిర్వహిస్తున్న వ్యభిచార దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. అమీర్‌పేటలోని ధరమ్‌కరమ్ రోడ్డులోని ఓయో టౌన్ విల్లా హోటల్‌లో కొంతకాలంగా గుట్టచప్పుడు కాకుండా జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన నాని అలియాస్ జోగేశ్వర్, అరవన్, హోటల్ మేనేజర్ ప్రేమ్ కలిసి ఈ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. Also Read: ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా విటులను ఆకర్షిస్తూ హోటల్‌లోనే దందా సాగిస్తున్నారు. హోటల్‌లో బస చేసేందుకు వచ్చేవారికి కూడా అమ్మాయిలు కావాలా? అంటూ ఆఫర్లు ఇస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. Also Read: నాని, ప్రేమ్‌తో పాటు ఇద్దరు యువతులను అరెస్ట్ చేయగా, మరో నిర్వాహకుడు అరవన్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం ఎస్.ఆర్.నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. Also Read:
By August 21, 2019 at 07:53AM
No comments