Breaking News

పెళ్లికి ఒప్పుకోలేదని యువతికి సైబర్ వేధింపులు.. న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసి


పరిచయం పేరుతో యువతికి దగ్గరైన యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. దీనికి ఆమె నో చెప్పడంతో కక్షగట్టాడు. ఆమె పరువు తీసేందుకు సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ చేసి నగ్న ఫోటోలు పెడుతున్నాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరూ కటకటాలపాలయ్యారు. Also Read: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌కు చెందిన వన్నల రాకేశ్‌(19) అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో యువతి ఫేస్‌బుక్ అకౌంట్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు తెలుసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె వద్ద పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా తిరస్కరించింది. కొద్దిరోజుల పాటు బతిమాలినా యువతి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. Also Read: ఇంటర్నెట్ నుంచి సేకరించిన న్యూడ్ ఫోటోలను ఆమె ఫేస్‌తో మార్ఫింగ్ చేసి యువతి ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్టు చేశాడు. ఆమెతో పాటు కుటుంబసభ్యుల ఫోన్ నంబర్లను అందులో పోస్టు చేసి అమ్మాయి కావాలంటే ఆ నంబర్లకు ఫోన్ చేయాలని మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితురాలికి అనేకమంది ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడారు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ అయి చూడగా అసలు విషయం తెలిసింది. దీంతో బాధితురాలు వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. దీనిపై సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ ఆశిష్‌రెడ్డి విచారణ జరిపి రాకేశ్‌తో పాటు అతడికి సహకరించిన చింతకింది మహేశ్‌(23), ఎండీ గౌస్‌(21)లను మంగళవారం అరెస్ట్ చేశారు. Also Read:


By August 21, 2019 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-posts-woman-nude-photos-in-social-media-due-to-her-rejects-his-marriage-proposal/articleshow/70763569.cms

No comments