Breaking News

‘రాయలసీమ లవ్‌స్టోరీ’ ట్రైలర్ రిలీజ్


ఏ వన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా - నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’. వెంకట్, హృశాలి గోసవిని హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రంలో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన పావని మరో హీరోయిన్‌గా నటిస్తోంది . తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు  చేస్తోంది. కాగా ఈ నెల 27న రిలీజైన ట్రైలర్ డిజిటల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతుంది. ట్రైలర్‌ను ఆదరించిన ప్రేక్షకులకు చిత్ర నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.

నాగినీడు, 30 ఇయర్స్ పృథ్వీ, జీవా, నల్ల వేణు, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు, గెటప్ శ్రీను, కొమరం, జబర్దస్త్ రాజమౌళి, మిర్చి మాధవి, సన్నీ, భద్రం, ప్రసన్న కుమార్, మధుమని తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.



By August 30, 2019 at 05:38AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47244/rayalaseema-love-story-trailer.html

No comments