మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్.. నలుగురి అరెస్ట్
మతిస్థితిలేని యువతిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడగా నలుగురిని అరెస్ట్ చేశామని, వీరిలో ఓ మైనర్ ఉన్నాడని సకినక పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబయిలోని ఓ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఉండే 20ఏళ్ల యువతికి మతిస్థిమితం సరిగా ఉండదు. ఆమెపై కన్నేసిన స్థానిక యువకులు బాబన్ సాల్వి, మహమ్మద్ ఖాన్, దీపక్ మనే, ప్రతమేశ్ గాంధీ, మైనర్ బాలుడు(17) మంగళవారం సమీపంలోని కొండపైకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుమార్తె మధ్యాహ్నం 3 గంటల నుంచి కనిపించకుండా పోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారిస్తుండగానే రాత్రి వేళ యువతి ఇంటికి చేరుకుంది. ఏం జరిగిందని తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితురాలు చెప్పిన వివరాలతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించగా, మైనర్ అయిన మరో నిందితుడిని కరెక్షన్ హోమ్‌కు తరలించారు.
By August 23, 2019 at 12:23PM
No comments