కోడెల ఇంట్లో చోరీ కలకలం.. కంప్యూటర్ మాయం!
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ శివప్రసాద రావు మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను ఆయన సొంత ఆఫీసులో వాడుకున్నారని విమర్శలు రావడం, అవసరమైతే డబ్బులు చెల్లిస్తానని ఆయన వివరణ ఇవ్వడం తెలిసిందే. ఫర్నీచర్ తీసుకెళ్లాలని, లేదంటే దానికి తగిన డబ్బులు తీసుకెళ్లాలని కోడెల తెలిపారు. ఈ రోజు (శుక్రవారం) అసెంబ్లీ అధికారులు కోడెల ఇంటికి వచ్చి ఫర్నిచర్ తీసుకెళ్లబోతున్నారు. వారు కోడెల ఇంటికి వెళ్లడానికి ముందు.. ఆయన నివాసంలో దొంగతనం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటాక గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన ఆఫీస్ రూంలో ఉంచిన రెండు కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. కరెంట్ పనికి సంబంధించి రిపేర్ చేయడం కోసమని ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి దాటాక కోడెల నివాసంలోకి వెళ్లారు. అనంతరం ఇంట్లోని కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మెన్‌పై దాడి చేసి కంప్యూటర్లతో పరారయ్యారు. కాగా, ఓ కంప్యూటర్‌ను అక్కడే వదిలేసి వెళ్లారని, ఉదయం వచ్చి మరో కంప్యూటర్‌ను గోడ పక్కన పడేసి వెళ్లారని సమాచారం. అందులోని డేటాను చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఫర్నీచర్ తీసుకెళ్లడం కోసం పోలీసులు కోడెల నివాసానికి వెళ్లడానికి ముందు ఈ చోరీ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
By August 23, 2019 at 12:24PM
No comments